బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టనున్న నిరాహారదీక్షపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సెటైర్లు వేశారు. ఈ నెల 10న ఢిల్లీలో మహిళల రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత నిరాహారదీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో రెండు సార్లు ఆధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడే మహిళల రిజ్వర్వేషన్లు గుర్తుకువచ్చాయా అని ప్రశ్నించారు షర్మిల. ఇప్పటి వరకు తెలంగాణలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదన్నారు. లిక్కర్ స్కామ్ తో మహిళలకు తలవంపులు తీసుకువచ్చిన కవిత మహిళల రిజర్వేషన్ల కోసం ధర్నా చేపట్టడం బంగారం పోయిందంటూ దొంగలే ధర్నా చేసిట్లు ఉంటుందని అని ఎద్దేవా చేశారు. తన లిక్కర్ స్కాం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే ఈ ధర్నాలు అని షర్మిల విమర్శించారు.