రాష్ట్రాన్ని గాలికొదిలేసి దేశాన్ని ఏలడానికి తిరుగుతుండు.. షర్మిల - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రాన్ని గాలికొదిలేసి దేశాన్ని ఏలడానికి తిరుగుతుండు.. షర్మిల

March 7, 2022

sharimila

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సోమవారం మండిపడ్డారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానని హామీ ఇచ్చి దానిని వంద శాతం ఎగ్గొట్టారని ఘాటుగా విమర్శించారు. హామీ ఇచ్చి నాలుగేండ్లయినా ఎరువులు ఇవ్వలేదనీ, కనీసం ఎప్పటి నుంచి ఇస్తారో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఒకవైపు పెట్టిన పెట్టుబడులు రాక, మరోవైపు ఎరువుల ధరలు పెరిగి, సాగు భారమై రోజుకు ఇద్దరు, ముగ్గురు అన్నదాతలు చనిపోతున్నా వారిని పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సమస్యలను గాలికొదిలేసి దేశాన్ని ఏలడానికి పక్కరాష్ట్రాలు పట్టుకొని తిరుగుతున్నాడంటూ తూర్పారబట్టారు. రైతులను ఆదుకోవడం చేతకాని మీ పరిపాలనతో దేశాన్ని ఏమని ఉద్ధరిస్తారు దొరా? అని ప్రశ్నించారు.