Sharmila wishes KTR on his birthday
mictv telugu

మీరలా చూస్తూనే ఉంటారు.. కేటీఆర్‌కు ఓటీటీ సంస్థ ఆఫర్

July 24, 2022

తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎడమ కాలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఓటీటీలో మంచి కంటెంట్ ఉంటే చెప్పమని కేటీఆర్ అభిమానులను కోరారు. దీనిపై నెటిజన్లు పలు రకాల సూచనలు చేయగా, తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 కూడా అందులో చేరింది. ‘కేటీఆర్ గారూ.. ఉదయం నీళ్ల ట్యాంకుతో మొదలెట్టి, రెక్కీతో థ్రిల్ అయి లంచ్ టైంకి ఫ్యామిలీ స్టోరీ కంప్లీట్ చేయండి. రాత్రికి మళ్లీ ఆర్ఆర్ఆర్ చూసేయండి. మీ వినోదం కోసం మంచి కంటెంట్ అందిస్తాం. మీరలా చూస్తూ ఉండిపోతారు’ అని ట్వీట్ చేసింది. మరోవైపు ఆదివారం కేటీఆర్ పుట్టినరోజు కూడా కావడంతో పలువురు ఆయనకు విషెష్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వెరైటీగా స్పందించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. కుట్ర సిద్దాంతం, క్లౌడ్ బరస్ట్, నీట మునిగిన ఇళ్లు, పంప్ హౌసులు వంటివి చూడాలని సెటైర్ వేశారు.