Sharmila's padayatra yet to resume as police serve show cause notice
mictv telugu

షర్మిల పాదయాత్రపై వెనక్కు తగ్గని పోలీసులు

December 4, 2022

వైఎస్ఆర్టీపీ అధినేత పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు, కార్యకర్తల దాడి వల్ల తాత్కాలికంగా నిలిపివేసిన పాదయాత్రను..వరంగల్ జిల్లాలో తిరిగి ప్రారంభించేందుకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అసలు పాదయాత్రకు అనుమతి ఎందుకు ఇవ్వాలో వివరించాలని కోరుతూ వరంగల్ జిల్లా పోలీసులు ఆమెకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. గతంలో పాదయాత్రకు ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించినట్లు పోలీసులు వెల్లడించారు.

షర్మిల ఫైర్..

పాదయాత్ర పున:ప్రారంభంపై న్యాయ పోరాటం చేస్తామని షర్మిల తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న పాదయాత్రను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నరన్నారు. తమ పార్టీ నిబంధనలను ఉల్లంఘించిందంటూ కొత్త నాటకానికి పోలీసులు తెరలేపారని ఫైర్ అయ్యారు.
పాదయాత్రను అడ్డుకునే విధంగా కుట్రలు జరిగినా.. ఈ అంశంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ న్యాయ పరంగా నోటీసులకు వివరణ ఇస్తుందని పేర్కొన్నారు. కోర్ట్ ఆదేశాలను గౌరవిస్తూ ఆదివారం ఒక్క రోజు పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు షర్మిల తెలిపారు.

తన పాదయాత్రతో కేసీఆర్‌కు భయం పట్టుకుందని షర్మిల పేర్కొన్నారు. ‘కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం షర్మిల’ అన్న విషయం సీఎం కేసీఆర్ కు అర్థమైందన్నారు. ఒక మహిళ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎత్తి చూపుతుంటే కేసీఆర్‌కి జీర్ణం కావడం లేదని విమర్శించారు. శాంతిభద్రతల షాకు చూపి పాదయాత్రను ఆపేందకు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. మా బస్సులు వాళ్లు తగలుబెట్టి మేము శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని చెప్పడం ఏంటని ఆమె ప్రశ్నించారు.