Sharwanand told about the accident that happened during the shooting of Jaanu movie
mictv telugu

విమానం నుంచి కింద పడ్డా.. రెండున్నరేళ్లు పట్టింది : శర్వానంద్

November 4, 2022

టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇంతవరకు ఎవరికీ తెలియని ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం నుంచి కిందపడ్డానని, కోలుకోవడానికి రెండున్నరేళ్లు పట్టిందని వెల్లడించారు. ప్రాణం పెట్టి చేసిన జాను సినిమా సమయంలో ఈ ఘటన జరిగిందని, బ్రతుకుతానని అనుకోలేదంటూ ఎమోషనల్ అయ్యాడు. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ రెండో సీజన్‌లో అడవి శేష్‌తో కలిసి శర్వానంద్ షోలో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ‘జాను సినిమాలో లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ బాగా హిట్ అయింది. ఆ పాట షూటింగ్ సమయంలో ఫ్లైట్ నుంచి కిందికి స్కై డైవింగ్ చేయాలి. అందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. షూట్ రోజు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం నుంచి కిందకు దూకేశాను. కానీ, కిందకు వచ్చాక పారాచూట్ పని చేయకపోవడంతో డైరెక్టుగా భూమ్మీద పడ్డాను. ఆపరేషన్ అయి కుడి చేతికి రెండు ప్లేట్స్, 24 నట్లు పడ్డాయి. కుడికాలికి ఒక ప్లేట్ పడింది. అన్నయ్య, నాన్న, ఫ్రెండ్స్ ఆసుపత్రిలో దగ్గరుండి చూసుకున్నారు. అసలు కోలుకుంటాను అనుకోలేదు. అందరి ప్రార్ధనలు, దేవుడి దయ వల్ల రెండున్నరేళ్లకు కోలుకున్నాను. ఇప్పుడు ఇలా ఉన్నాను. ఈ సంఘటనను మాత్రం జీవితంలో మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో బాలయ్య సైతం గతంలో తనకు జరిగిన ప్రమాదం గురించి వెల్లడించాడు. పవిత్ర ప్రేమ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో బాంబ్ బ్లాస్ట్ ఉంటే తనకు ఎఫెక్ట్ అయిందని తెలిపాడు.