శశిథరూర్ మళ్లీ పప్పు అయ్యాడు.. మహావీరుడికి బదులు..! - MicTv.in - Telugu News
mictv telugu

శశిథరూర్ మళ్లీ పప్పు అయ్యాడు.. మహావీరుడికి బదులు..!

March 29, 2018

సోషల్ మీడియాలో ఏమాత్రం చిన్న పొరపాట్లు జరిగినా నెటిజన్లు పీకి పందిరేస్తారు. ట్వీట్లలో, ఫేస్‌బుక్ పోస్టుల్లో తరచూ తప్పులు చేసే కాంగ్రెస్ నేత శశిథరూర్ ఈసారి పెద్ద పొరపాటే చేశారు. మహవీర్‌ జయంతి సందర్భంగా ఓ పోస్ట్ పెడుతూ దానికి గౌతమ బుద్ధుడి బొమ్మను అతికించి శుభాకాంక్షలు చెప్పారు. అంతే అదికాస్తా వైరలైంది. నెటిజన్లు శశిని ఆడుకుంటున్నారు. తిట్లను తట్టుకోలేక శశి క్షమాపణలు చెప్పారు. ఓ టీవీ చానల్ బుద్ధుడి ఫోటో పెట్టడంతో తానూ అదే పెట్టానంటూ, ఆ లింకును ట్వీట్ చేశారు. ఏదేమైనా తాను తప్పు చేశానని, ఆ సంగతి తనకు తెలియజేసినందుకు కృతజ్ఞతలని అన్నారు. శశి గతంలో ఇలాంటి ట్వీట్లు చాలా చేశారు. క్రైస్తవులు బలిచ్చేందుకు గొర్రెను తీసుకెళ్తున్న ఫొటో పెట్టి ఓనం శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత  అరవింద్‌ కేజ్రీవాల్‌ ఫొటో పెట్టి గాంధీ జయంతి శుభాకాంక్షలు అందజేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఫొటో పెట్టి బాలల దినోత్సవం శుభాకాంక్షలు చెప్పారు. ఇవి కావాలని చేస్తున్న పోస్టులు అని కొందరు, పొరపాట్లేని కొందరు భావిస్తున్నారు.