సంజూ శాంసన్ పెద్దమనసు.. స్టేడియం సిబ్బందికి విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

సంజూ శాంసన్ పెద్దమనసు.. స్టేడియం సిబ్బందికి విరాళం

September 9, 2019

కేరళ కుర్రాడు, టీమిండియా యువ క్రికెటర్ సంజు శాంసన్‌ ఔదార్యం చాటుకున్నారు. తన ఒక్కరోజు మ్యాచ్‌ ఫీజును తిరువనంతపురంలోని క్రికెట్ స్టేడియం సిబ్బందికి విరాళంగా ఇచ్చారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషన్‌ స్టేడియంలో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన ఆఖరి వన్డేలో సంజు చెలరేగి ఆడారు. మ్యాచ్ తరువాత మ్యాచ్‌ ఫీజు రూ.1.5 లక్షలను మైదాన సిబ్బందికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

‘స్టేడియం తడిగా ఉండి ఉంటే మ్యాచ్‌ను రద్దుచేసేవారు. ఈ మ్యాచ్‌ జరిగిందంటే దానికి కారణం సిబ్బంది. వారికి ధన్యవాదాలు. నా మ్యాచ్‌ ఫీజును వారికి విరాళంగా ఇస్తున్నాను’ అని అన్నారు. వర్షం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి వన్డేను 20 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్‌ 48 బంతుల్లో 91 పరుగులు చేశారు. అతడికి తోడుగా టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (51) హాఫ్ సెంచరీ చేయడంతో భారత్-ఎ 204 పరుగులు చేసింది. తరువాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా-ఎ 168 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్-ఎ 4-1తో కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే సంజు ఔదార్యాన్ని కాంగ్రెస్  నేత, రాజ్యసభ సభ్యుడు శశి థరూర్ ప్రశంసించారు. ఈమేర ఆయన సంజు శాంసన్ ఫోటోను ట్వీట్ చేసారు.