కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తలకు గాయం - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తలకు గాయం

April 15, 2019

కాంగ్రెస్ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తలకు తీవ్ర గాయమై ఆరు కుట్లు పడ్డాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తిరువనంతపురం లోక్‌సభ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న శశిథరూర్.. సోమవారం ఉదయం గాంధారి అమ్మన్ కోవిల్ ఆలయంలో తులాభారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన జారిపడ్డారు. దీంతో శశిథరూర్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. తలకు ఆరు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేరళలోని 20 ఎంపీ స్థానాలకు ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి.