Shashi Tharoor opts out of Gujarat campaign
mictv telugu

శశిథరూర్‌కు కాంగ్రెస్ షాక్

November 16, 2022


కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు అవమానం జరిగింది. గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో పేరు లేదు. చివరకు కన్హయ్య కుమార్‌కు స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో స్థానమిచ్చిన కాంగ్రెస్.. శశిథరూర్‌ని పక్కన పెట్టింది. ఉహించని విధంగా హైకమాండ్ షాక్ ఇచ్చింది. గుజరాత్ ప్రచారానికి వెళ్లాలనుకున్న ఆయనకు ఝలక్ ఇచ్చింది. కాంగ్రెస్‌లో కోల్డ్ వారే దీనికి కారణమా? స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఆయన పేరు ఎందుకు లేదు?

అసలే కాంగ్రెస్
దేశంలో కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వరుసగా కీలకనేతలు పార్టీకి దూరమయ్యారు. ఊహించని వలసలతో కాంగ్రెస్ కుయ్యో మొర్రో అంటోంది. పార్టీని నమ్ముకున్నోళ్లకు పొమ్మనలేకపొగ బెడుతోంది.మొన్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన శశిథరూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ ప్రచారం కోసం ఎంపిక చేసిన స్టార్ క్యాంపెయినర్లలో ఆయన పేరులేకుండా చేసింది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు అయ్యాక జరుగుతున్న ఎన్నికలు ఇవి. గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఉంది. గుజరాత్‌లో వరుసగా ఏడోసారి బీజేపీని నువ్వా నేనా అన్న రేంజ్ ఢీకొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు ఊహించని షాక్ ఇచ్చింది.

40 మందితో లిస్టు

గుజరాత్ ఎన్నికల ప్రచారంకోసం కాంగ్రెస్ నలభైమందితో స్టార్ క్యాంపెయినర్ల లిస్టు ప్రకటించింది. మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ , ప్రియాంక గాంధీలు,అశోక్ గెహ్లాట్ , భూపేష్ బగేల్ , దిగ్విజయ్ సింగ్ , కమల్ నాథ్ , సచిన్ పైలెట్ , కన్హయ్యకుమార్ పేర్లు ఉన్నాయి. అధ్యక్ష రేసులో ఖర్గేతో పోటీపడిన శశిథరూర్‌ని పక్కన పెట్టేసింది. కాంగ్రెస్‌లో జరుగుతోన్న కోల్డ్ వారే కారణంగా కనిపిస్తోంది. కావాలనే ఆయన పేరుని తప్పించారని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

ప్రచారానికి దూరం

గుజరాత్ ప్రచారానికి రావాలని శశిథరూర్‌ని కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఆహ్వానించింది. ఆయన వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే స్టార్ క్యాంపెయినర్ల లిస్టు వచ్చింది. ఈ జాబితాలో తన పేరులేకపోవడంతో గుజరాత్ వెళ్లొద్దని శశిథరూర్ అనుకుంటున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో శశిథరూర్ ది డిఫరెంట్ స్టైల్. అంతేకాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్.సమయం దొరికినప్పుడల్లా గాంధీల నాయకత్వాల్ని ప్రశ్నిస్తుంటారు.జీ 23 గ్రూప్‌లో కూడా శశిథరూర్ సభ్యులు.కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో నిలిచారు. మల్లికార్జున ఖర్గేకు పోటీ ఇచ్చారు.