కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది మార్చి 25 నుంచి శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్ల తోపాటు అన్ని రైళ్లను నిలిపివేశారు. మే నెలలో వలస కూలీల కోసం శ్రామిక్ ప్రత్యేక రైళ్లను, మే 12 నుంచి స్పెషల్ ఏసీ రైళ్లను కేంద్ర రైల్వే శాఖ నడిపింది. జూన్ ఒకటో తేదీ నుంచి వంద రైళ్లను ప్రారంభించి.. సెప్టెంబర్ ఒకటి నుంచి మరో 80 రైళ్లను పట్టాలెక్కించింది.
తాజాగా ఈ నెల 17 నుంచి శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఢిల్లీ నుంచి మెట్రో నగరాలు, పర్యాటక ప్రాంతాలకు శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తాయి. వీటికి ఈరోజు నుంచి రిజర్వేషన్లు మొదలయ్యాయి. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే బోర్డు 196 రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లతోపాటు రాజధాని, దురంతో రైళ్లను కూడా నడుపాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.