పాకిస్తాన్‌లో పెళ్లికి వెళ్లిన కాంగ్రెస్ నేత..తిట్టిపోస్తున్న నెటిజన్లు  - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్‌లో పెళ్లికి వెళ్లిన కాంగ్రెస్ నేత..తిట్టిపోస్తున్న నెటిజన్లు 

February 21, 2020

గత కొన్ని రోజులుగా భారత్ – పాకిస్తాన్ మధ్య సంబంధాలు తెగిపోయాయి. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాలు ఎడమొహం పెడమొహంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా పాకిస్థాన్‌కు వెళ్లడం వివాదస్పమైంది. అక్కడికి వెళ్లి ఓ పెళ్లి ఫంక్షన్‌లో నవ్వులు చిందిస్తూ కనిపించారు. తన మిత్రులు,సన్నిహితులతో ఆనందంగా గడిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. 

లాహోర్‌లో జరిగిన ఓ పెళ్లికి ఆయన హాజరయ్యాడు. ఆయన శత్రు దేశానికి వెళ్లారని నెటిజన్లు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. ‘దేశ సరిహద్దుల వద్ద భారత జవాన్లు ప్రాణాలు కోల్పోతుంటే మన బాలీవుడ్‌ ప్రముఖులు మాత్రం పాకిస్థానీలతో తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఆయన్ను అలా చూడటం చాలా విచారకరం అంటూ కొంత మంది. శత్రుఘ్న సిన్హాకు పాక్‌లో ఏం పని అంటూ మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీ నేత,పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఇలా పర్యటించి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.