ఆమెకు 67 ఏళ్లు అతనికి 28 ఏళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఆమెకు 67 ఏళ్లు అతనికి 28 ఏళ్లు

March 25, 2022

oooo

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఓ వింత ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. ఓ 67 ఏళ్ల మహిళతో 28 ఏళ్ల యువకుడు ప్రేమలో పడ్డారు. అంతేకాదు వారి ప్రేమను నిలబెట్టుకోవడానికి న్యాయవాదులతో ఫైట్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మొరెనా జిల్లాలో ఓ 28 ఏళ్ల యువకుడు, 67 ఏళ్ల మహిళ ప్రేమించుకున్నారు. నిజానికి ఇద్దరికి రెండు జనరేషన్‌ల గ్యాప్ ఉంది. అయినా వారి మధ్య ప్రేమ చిగురించింది. కైలారస్ ప్రాంతంలో ఉండే యువకుడు భోలుగా, మహిళ రాంకలి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. కానీ, వారికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దాంతో ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.

అయితే, వారి సహజీవనాన్ని ధ్రువీకరించుకోవడానికి ఇద్దరు కోర్టుకు వెళ్లారు. వారి లివ్ ఇన్ రిలేషన్ షిప్‌ను డాక్యుమెంట్ నోటరీ చేయించుకోవడానికి గ్వాలియర్ జిల్లా కోర్టుకు కలసి వెళ్లారు. భవిష్యత్తులో తమ సంబంధంపై ఎటువంటి వివాదాలు తలెత్తకుండా, ఉండేందుకు నోటరీ చేయించుకుంటున్నామని వారు తెలిపారు. కానీ అలాంటి పత్రాలు చట్టపరమైన రూపంలో చెల్లుబాటు కావని స్థానిక న్యాయవాది అవస్తి చెప్పడంతో ఎలాగైనా తమకు ఆ డాక్యుమెంట్ నోటరీ ఇవ్వాలంటూ న్యాయవాదులతో గొడవ పెట్టుకున్నారు.

మరోవైపు ఈ ఘటనపై నెటిజన్స్ విచిత్రంగా కామెంట్స్ చేస్తున్నారు. వేర్వేరు కులాల వారు, వేర్వేరు మతాలకు చెందిన వారు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం చూశాం కానీ ఇలాంటి విచిత్ర ప్రేమికులను ఎప్పుడు చూడలేదంటూ వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.