ఆమె సెలబ్రిటీనే కానీ ఓ నిందితురాలు: ముంబై కోర్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె సెలబ్రిటీనే కానీ ఓ నిందితురాలు: ముంబై కోర్ట్

March 24, 2022

 

re

ముంబై కోర్ట్ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై తీవ్రంగా మండిపడింది. ఆమె ఒక సెలబ్రిటీనే అయినా ఆమె ఒక నిందితురాలన్న విషయాన్ని మరచిపోవద్దంటూ గుర్తు చేసింది. బాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత జావెద్ అక్తర్ ఆమెపై వేసిన క్రిమినల్ పరువు నష్టం దావా కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది.

”కేసు విచారణ మొదలైన అప్పటినుంచి ఇప్పటివరకు కంగన రెండంటే రెండేసార్లే విచారణకు వచ్చింది. కేసు విచారణ మొదలైనప్పుడు ఒకసారి, మరోకసారి. ఇప్పటిదాకా కోర్టుకు రాకుండా ఆమె తన నిబంధనలనే అమలు చేస్తోంది. తనకు ఇష్టమున్నప్పుడు వస్తోంది. ఇష్టమొచ్చినట్టు చేస్తోంది. ఆమెకు అసలు కోర్టుకు సహకరించాలన్న ధ్యాసే లేదు” అంటూ కోర్ట్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో ఆమెపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వకుండా, విచారణకు రాకుండా ఆమె తప్పించుకు తిరుగుతోంది. కావాలనే ఆమె ఎగ్గొడుతోందని మండిపడ్డారు. మినహాయింపు కావాలంటూ అప్పుడెప్పుడో కేసు విచారణ మొదలైనప్పుడు అడిగారని, అప్పట్నుంచి ఇప్పటిదాకా వాటిపై ఆదేశాలివ్వాలంటూ మాట్లాడుతున్నారే తప్ప.. అసలు కేసు విచారణకు మాత్రం సహకరించడం లేదని మేజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్ అన్నారు. ఇప్పటిదాకా ఆమె చేసిన విజ్ఞప్తులన్నింటికీ కోర్టు ఒప్పుకొందని, ఇకపై ఒప్పుకొనే ప్రసక్తే లేదని తేల్చి చేప్తూ.. ఏప్రిల్ 7వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

మరోపక్క ఆమె కేసును ముంబైలోని 10వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఆర్ఆర్ ఖాన్ విచారిస్తున్నారు. పలుమార్లు విచారణకు కంగన డుమ్మా కొట్టడంపై ఆయన మండిపడ్డారు. ఇప్పటిదాకా రెండేసార్లే కోర్టు విచారణకు హాజరైందని, ఆమేం దేనికీ అతీతం కాదని అన్నారు. కేసు విచారణకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపునివ్వాలన్న కంగన విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. అసలు కేసు విచారణ ఎక్కడిదాకా వెళ్లిందని మినహాయింపునివ్వాలని అసహనం వ్యక్తం చేశారు.