నా విజయానికి కారణం ఆమెనే: చిరంజీవి - MicTv.in - Telugu News
mictv telugu

నా విజయానికి కారణం ఆమెనే: చిరంజీవి

March 8, 2022

04

తెలుగు చిత్రసీమ పరిశ్రమలో మెగస్టార్ చిరంజీవిగా ఎదగడానికి, ఇంతంటి విజయాలను సాధించడానికి నా భార్య సురేఖ సపోర్ట్ ప్రధాన కారణమని, సురేఖ వల్లే ఇది సాధ్యమైంది అని చిరంజీవి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన సతీమణి సురేఖకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి మాట్లాడుతూ.. ”నా సతీమణి సురేఖ అందించిన సహకారం మరవలేనిది. ఇంట్లో బాధ్యతలన్నీ ఆమె తీసుకోవడం వల్లే, నేను సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించా” అని అన్నారు. అనంతరం చిరంజీవి ఛారిట‌బుల్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన తల్లి అంజనా దేవి, సతీమణి సురేఖలతో కలిసి సినీ ప‌రిశ్రమకు చెందిన మ‌హిళా కార్మికుల‌కు చీర‌లు అందించారు.

‘అమ్మ వల్లే మహిళా పక్షపాతిగా మారాను. ఒక కుటుంబంలో మహిళలలకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. చిన్నతనంలో నాకోసం అమ్మ ఎంతో కష్టపడ్డారు. ఆమె కారణంగానే నేను మహిళా ప‌క్షపాతిగా మారాను. ఇక నేను సక్సెస్‌ఫుల్‌ హీరోగా నిలవడానికి సురేఖనే ప్రధాన కారణం. ప్రతి మ‌గాడి విజ‌యం వెనకాల ఒక మహిళ కచ్చితంగా ఉంటుందనడానికి సురేఖ మరో నిదర్శనం. ఈ మ‌హిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను’ అని చిరంజీవి అన్నారు.