ఆమెను ఆమే పెళ్లి చేసుకుంది… - MicTv.in - Telugu News
mictv telugu

ఆమెను ఆమే పెళ్లి చేసుకుంది…

October 11, 2018

ఆడపిల్లకు వయసు మీద పడగానే ఆమె పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులు అనుకుంటారు. తమ జంటలానే తమ కూతురు కూడా పెళ్లి చేసుకుని వర్ధిల్లాలని కోరుకుంటారు. కానీ ఓ కూతురు తన 32వ ఏట తల్లిదండ్రుల కోరికను తీర్చింది. అంతవరకు తల్లిదండ్రులు ఆమె ప్రతీ పుట్టినరోజుకు పెళ్లి చేసుకోవమ్మా అని చెప్పేవారు. కానీ ఆమె పెళ్లే చేసుకోనని నిర్ణయించుకుంది. కారణం తన అమ్మానాన్నలు కోరుకున్నటువంటి మంచి వరుడు తనకు తారసపడలేదు కాబట్టి. ఇంతకాలానికి మరి ఆమె వరుడు దొరికాడా ? వివరాల్లోకి వెళ్దాం…  

ఆమె పేరు లులూ జెమియా. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుంటోంది. 32 ఏళ్ళ వయసు వచ్చింది. ఇంట్లో తల్లిదండ్రులు కూతురు పెళ్లి చేసుకుంటే బాగుండని బెంగ పెట్టుకున్నారు. బయట సమాజం కూడా ఆమె వయసును గుర్తు చేస్తూ పెళ్ళి ఎప్పుడని నొక్కి వక్కాణించేవారు. దీంతో విసుగుచెందిన లులూ తన 32వ బర్త్ డే రోజున పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.She married herself …అతికొద్ది మంది అతిథుల మధ్య పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆమె తల్లిదండ్రులు కోరుకున్న వరుడు దొరికాడా? అంటే దొరికాడనే చెబుతోందామె. ఇంతకీ ఆమె వరుడు ఎవరంటే ఆమే ! అవును ఆమెను ఆమే పెళ్ళి చేసుకుంది.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కూతురు ఇంత పని చేస్తున్నానని ముందే చెప్పడంతో ఈ పెళ్ళిక లులూ తల్లిదండ్రులు రాలేకపోయారు. ఈ పెళ్లి గురించి ఆమె మాటల్లోనే…

‘నాకు పదహేరేళ్లు వచ్చినప్పటినుంచే మా నాన్న నాకోసం వెడ్డింగ్‌ స్పీచ్‌ రాయడం మొదలు పెట్టాడు. అమ్మ రోజూ ప్రార్థనల్లో నా పెళ్ళి తొందరగా జరగాలని దేవుణ్ణి ప్రార్థించేది. నాకు వచ్చే భర్త నాన్నంత మంచివాడై వుండాలని కోరుకునేది. కానీ నాకు ఇంతవరకు అలాంటి మగాడు కనిపించలేదు. అలాగని అమ్మానాన్నల కోరికను తీర్చలేకుండా వుండలేను. అందుకే ఈ పుట్టిన రోజున(ఆగస్టు 29) నన్ను జాగ్రత్తగా చూసుకునే నా సోల్‌మేట్‌ని వివాహమాడాను.She married herself …అదెవరో కాదు లులూ జెమియానే. అంటే నేనే.. నన్ను నేనే పెళ్లాడాను’ అని తన పెళ్లి గురించి చెప్పింది లులూ. గోఫండ్‌మీ అనే పేజీ క్రియేట్‌ చేసి తన పెళ్లికి ఖర్చులకు డబ్బులు సమకూర్చుకుంది లులూ. సోదరుడు తన కోసం తయారు చేసిన కేక్ కట్‌ చేసి బర్త్‌డేతో పాటుగా వెడ్డింగ్‌ను కూడా సెలబ్రేట్‌ చేసుకుంది. తల్లిదండ్రులు తన పెళ్లికి రాలేకపోయారని బాధపడింది లులూ. ఇదిలా వుండగా కూతురి పెళ్లిపై లులూ తల్లిదండ్రులు స్పందించారు. ‘మాకోసం తను ఇలాంటి వింత నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మనసు మార్చుకుని మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని కోరుకుంటున్నాం’ అని అన్నారు. పాపం ఆ తల్లిదండ్రుల కోసమైనా లులూ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందో లేదో ?