లవ్ ప్రపోజ్.. 3 వేల అడుగుల కొండపై ఉంగరం తొడిగి.. - MicTv.in - Telugu News
mictv telugu

లవ్ ప్రపోజ్.. 3 వేల అడుగుల కొండపై ఉంగరం తొడిగి..

July 11, 2019

Man proposed to girlfriend.

వన్ సైడ్ లవ్ అనేది ఒకవైపు నుంచి చాలా ఆరాధనగా వుంటుంది. అలా మనసులో ఆరాధించి, పూజించి, ప్రేమించి ఒకరోజు ఆ ప్రేమ గురించి వారికి చెప్పాలనుకుంటారు. సాదాసీదాగా చెబితే ప్రభావితం చేయదని భావించి కాస్త వెరైటీగా చెబుతుంటారు. అలా చెప్తే తన ప్రేమను తప్పకుండా ఒప్పుకుంటారని వారి నమ్మకం. అలా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు చాలామంది తమ ప్రేమను విభిన్న మార్గాల్లో వినూత్నంగా తెలిపారు. ప్రియురాలి అంగీకారాన్ని పొందారు. సముద్రం గర్భంలో, కొండల పైన, గాల్లో ఇలా రకరకాల చోట్ల తమ ప్రేమను వ్యక్తం చేసి రింగు తొడిగారు. ఇలాంటివి మనకు విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.  

బ్రిటన్‌కు చెందిన క్రిస్టియన్ రిచర్డ్స్ తన గర్ల్‌ఫ్రెండ్ బెక్స్ మార్లేను చాలా గాఢంగా ప్రేమించాడు. ఏదో ఒకరోజు తన ప్రేమను తెలిపి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆమెను నార్వేలోని కెజెరగబోల్టెన్‌లోని 3వేల అడుగుల ఎత్తైన శిఖరం పైకి తీసుకెళ్లాడు. అతనితో కొండను చూస్తున్నానని బెక్స్ అనుకుంది. కానీ అక్కడ ఆమెకు ఊహించని అనుభూతి ఎదురైంది. అక్కడ రెండు శిఖరాల మధ్య ప్రమాదకరంగా వేలాడే బండరాయి మీదకు తీసుకెళ్లాడు. దానిమీద మోకాలిపై కూర్చుని, ఉంగరం చూపించి ఆమెకు ప్రపోజ్ చేశాడు. అంతే ఆమె షాక్ అయింది. అంతెత్తు పైన వుండేసరికి ఆమె గుండెలో ఓవైపు దడగా వుంది. మరోవైపు ఆమెకు ఇది ఊహించని సర్‌ప్రైజ్. ఆనందంతో అతని ప్రపోజల్‌కు ఓకే చెప్పేసింది. ఆమె ఆ రాయి మీద నిలబడటానికి భయపడింది. ఆ భయాన్ని ఆమె కళ్లల్లో గుర్తించిన క్రిస్టియన్ అక్కడి నుంచి ఆమెను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. సంబ్రమాశ్చర్యానికి గురైన బెక్స్ మాట్లాడుతూ.. ‘క్రిస్టియన్ రిచర్డ్స్ అక్కడ ప్రపోజ్ చేస్తాడని అస్సలు ఊహించలేదు. అతడు ఆ రాయిపై అలా ప్రమాదకరంగా కుర్చోవడం చూసి నాకు భయం వేసింది. చాలా థ్రిల్‌గా వుంది’ అని తన ఆనందాన్ని పంచుకుంది.