హైదరాబాద్ లో ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా పెట్టిన బస్సులు రంగంలోకి వచ్చేశాయి. హైదరాబాద్ లో లేడీస్ ఇప్పుడు ఎక్కడకు కావలన్నా ఫ్రీగా వెళ్లొచ్చు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ బస్సులు ప్రస్తుతానికి రెండు మాత్రమే వచ్చాయని తర్వరలో మరన్ని వస్తాయని డీజీపీ అంజన్ కుమార్ చెప్పారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సీ షటిల్ బస్సులు తయారయ్యాయని డీజీపీ అంజన్ కుమార్ తెలిపారు. మహిళలకు అన్ని సౌకర్యాలు ఉండేటట్లు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ బస్సులు ఆడవాళ్ళు ఉచితంగా, సురక్షితంగా ప్రయాణించవచ్చని అన్నారు. భద్రత కోసం బస్సులో ఓ సెక్యూరిటీ గార్డు కూడా ఉంటాడు.
అయితే షీ షటిల్ బస్సులు ప్రసత్తుతానికి రెండే తిరుగుతున్నాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య పెచేందుకు ఏర్పాట్లు చేస్తామని అంజన్ కుమార్ అన్నారు. మహిళలు ఇక మీదట ఇబ్బంది పడకుండా ఈ బస్సులను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.