హైదరాబాద్‌లో మహిళల భద్రత కోసం మరో షి షెటిల్ బస్సు అందుబాటులోకి వచ్చింది. సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ), డీసీఎం కంపెనీలు సంయుక్తంగా దీన్ని ప్రారంభించారు. ఇది లింగంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్ – విప్రో సర్కిల్ మధ్య తిరుగుతుంది. ఐటీ కంపెనీల ఉద్యోగినుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నడుపుతున్నారు. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర దీన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ అవినాశ్ మొహంతీ, ఎస్సీఎస్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. డీఎస్ఎం కంపెనీ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ బస్సును స్పాన్సర్ చేసింది. హైదరాబాద్‌లో ఇది 14వ షీ షెటిల్ బస్సు.