she team police arrested Psychologist BV Nagesh in Hyderabad
mictv telugu

HYD యువతిపై లైంగిక వేధింపులు.. సైకాలజిస్ట్ అరెస్ట్

September 3, 2022

she team police arrested Psychologist BV Nagesh in Hyderabad

మోటివేషనల్ స్పీచుల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచే సైకాలజిస్ట్ బి పి నగేశ్‌ను హైదరాబాద్ షీ టీమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరుపరుచగా, 16 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన నగేశ్ పలు కళాశాలల్లో మోటివేషనల్ స్పీచ్ కోసం తరగతులు నిర్వహిస్తుంటాడు.

మాదాపూర్‌లోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉండే నగేశ్.. ఏదైనా సమస్యలు, సందేహాలుంటే తనకు ఫోన్ చేయవచ్చని ఫోన్ నెంబరు ఇచ్చాడు. ఈ క్రమంలో యువతులు ఫోన్ చేసినప్పుడు అసభ్యకరంగా మాట్లాడడం, శారీరక వాంఛ తీర్చమనడంతో ఓ యువతి షీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ఆధారాలతో సేకరించి నగేశ్‌ను అరెస్ట్ చేశారు. అలాగే వేధింపులకు గురయ్యే విద్యార్ధులు, మహిళలు సోషల్ మీడియా ద్వారా లేదా నేరుగా ఫిర్యాదు చేయాలని, నోరు మూసుకొని భరంచవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో బాధితుల సమాచారం బహిరంగపర్చకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.