నిమజ్జనంలో ఆకతాయి చేష్టలు.. 73 మందిపై కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

నిమజ్జనంలో ఆకతాయి చేష్టలు.. 73 మందిపై కేసులు

September 13, 2019

She Teams Case On Eve Teasers

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం అంటే హడావుడి మామూలుగా ఉండదు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గణనాయకుడిని గంగమ్మ ఒడికి పంపే మహత్తర ఘట్టాన్ని చూసేందుకు హుస్సేన్‌సాగర్‌కు తరలివస్తుంటారు. ఇలా అంతా భక్తిమార్గంలో ఉంటే ఆకతాయిలు మాత్రం తమ వెకిలి చేష్టలతో ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అలాంటి వారిని గుర్తించేందుకు ముందుగానే పోలీసులు ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన నిమజ్జన కార్యక్రమంలో షీ టీమ్స్ సిబ్బంది అకతాయిల భరతంపట్టారు.

వివిధ ప్రాంతాల్లో ముందుగానే షీటీంలను అధికారులు ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో వెకిలి చేష్టలతో రెచ్చిపోయి కామెంట్‌ చేస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్న పోకిరీల ఆటకట్టించారు. పలు ప్రాంతాల్లో అసభ్యంగా ప్రవర్తించిన 73 మందిపై కేసులు నమోదు చేశారు. నీళ్లు చల్లడం, పువ్వులు చల్లుతూ కామెంట్లు చేసిన వారిని అరెస్టు చేశారు. ఈసారి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగిందని పోలీసులు చెబుతున్నారు.