మహిళల గర్భాధారణ సమయం 9 నెలలు. కొన్ని సార్లు అంతకంటే ముందుగా 7,8 నెలలకు నెలల్లో పిల్లలు పుడుతారు. కానీ ఓ మహిళ 9 సంవత్సరాలు గర్భిణీగా ఉంది. మీరు విన్నది నిజమే.తొమ్మిది సంవత్సరాలు పాటు శిశువును కడుపులో దాచుకుంది. వైద్యుల మాట పెడ చెవిని పెట్టడంతో పాటు..ఆమె నిర్లక్ష్యం కారణంగా చివరికి బిడ్డకు బదులు ఆమె కడుపులో నుంచి రాయిని వైద్యులు బయటకు తీశారు. ఆమె కూడా ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. ఈ ఆశ్చర్యపరిచే ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
అమెరికాలోని కాంగో నగరానికి చెందిన ఓ మహిళ గర్భం దాల్చింది. తరచూ వైద్య పరీక్షలు చేస్తున్న క్రమంలో ఏడో నెలలో పిండం కదలడం లేదని వైద్యులు నిర్దారించారు. ఆమెకు కొన్ని మందులు రాసిచ్చి తర్వాత స్కానింగ్ కోసం ఆస్పత్రికి రావాలని సూచించారు. అయితే ఆమె వైద్యుల మాటలను వినిపించుకోలేదు. గర్బ గర్భస్రావం అయిందని భావించి ఆస్పత్రికి తిరిగి వెళ్లలేదు.
9 సంవత్సరాల పాటు పాటు అలానే ఉండిపోయింది. చనిపోయిన శిశువును 9 సంవత్సరాల పాటు కడుపులోనే మోసింది. దీంతో ఆ మహిళ తినే ఏ ఆహారాన్ని జీర్ణించుకోలేక పోయింది. క్రమంగా పోషకాహారలోపానికి గురవుతూ వచ్చింది. దీర్ఘకాలిక పోషకాహార లోపంతో చివరకు ఆమె కూడా మరణించింది. ఆమెకు పోస్టుమార్టం చేసిన వైద్యులు.. మహిళ కడుపులో ఉన్న శిశువు పూర్తిగా రాయిలా మారిపోయిందని గుర్తించారు. మహిళ కడుపులోని పిండం రాయిగా మారి పేగుల్లో కూరుకుపోవటంతో మహిళ మృతి చెందినట్టుగా నిర్ధారించారు.