గణేష్ నిమజ్జనంలోని పోకిరీల మీద షీ టీమ్స్ కొరడా ! - MicTv.in - Telugu News
mictv telugu

గణేష్ నిమజ్జనంలోని పోకిరీల మీద షీ టీమ్స్ కొరడా !

September 8, 2017

గణేష్ నిమజ్జనోత్సవంల పోరగాండ్లు మస్తు గడ్ బడ్ లు చేసిర్రు. అమ్మాయిలను ఆటపట్టిచ్చినట్టు సిసి కెమెరాలల్ల రికార్డ్ అయింది. దాని ఆధారంగా ఆ పోకిరీగాళ్ళను పట్టుకున్నరు షీ టీమ్ పోలీసోల్లు. వాళ్ళ మీద కేసులు బుక్ జేశి పొట్టు పొట్టు ఉత్కుతరట. పోయి పోయి గా భక్తి జాగల గూడ పోరగాండ్ల పరాష్కాలు గాకపోతే ఏంది. ఇప్పుడు వాళ్ళు ఆ సిసి కెమెరాల ఎవిడెన్సుతోని దగ్గరదగ్గర 30 మంది దాకున్న చిల్ బులా పోరగాండ్లను పట్టుకొని బొక్కలు సాపు జేస్తే మల్ల ఎప్పుడు గూడ ఇసుంటి నీచం పన్లు చెయ్యరు. ఎల్లిగాని చింత ఎల్లిగానికుంటే మల్లిగాని చింత మల్లిగానికున్నదన్నట్టు గీ హౌల పోరగాండ్ల చింత భక్తి మీద గాకుంట అమ్మాయిల మీద ఫోకసై వుండె. ట్యాంకుబండ్ దగ్గరనే ఎక్కువ పోరగాండ్లు పట్టుబడ్డరు. ఇంకా ఎస్ ఆర్ నగర్, ఛార్మినార్, ఫలక్ నుమా, చాదర్ ఘాట్, మెహిదీ పట్నం, సికింద్రాబాద్ ఏరియాలల్ల గూడ పట్టుకున్నరు.

దొర్కిందే ఛాన్సన్నట్టు అమ్మాయిలను గెల్కినోళ్ళనిప్పుడు షీ టీములోల్లు ఇడుస్తరా.. పట్టుకొని కైమ కైమ జేస్తరు. హైదరాబాదుల గణేష్ నిమజ్జనమంటే ఎక్కడెక్కడి పబ్లిక్కు అస్తరు. గణపతిని దర్శించుకొని మొక్కుకుందామని అచ్చినోళ్ళను ఆవారా పోరగాండ్లు శిడాయించుడు స్టార్ట్ జేశిర్రట. కొందరు నీళ్ళ ప్యాకెట్లల్ల నీళ్ళను వాళ్ళ మీద సల్లుడట, కొందరేమో కాయిదాలు చింపి అమ్మాయిల మీద ఇసురుడట. కొందరు బట్టెవాజిగాళ్ళైతే ఫోన్లు పట్టుకొని ఎదురైన అమ్మాయితో సెల్ఫీలు దిగుడు పెట్టిర్రట. ఇట్ల గంతమంది జనాలల్ల మేము ఏం జేశిన నడుస్తది అనుకున్నరేమో. పైగా మమ్ములను ఎవరు జూస్తరు అని అన్కొని ఉడ్కుడ్కు పప్పుచారు కాలు మీద పోస్కున్నంత పని జేస్కున్రు.
మున్పటి లెక్క రోడ్డు మీద పోయే అమ్మాయిలను శిడాయించే జమాన కాదు. అమ్మాయిను శిడాయిస్తే షీ టీమ్స్ తాట తీసెటందుకు సిద్ధంగుంటయని పాపం ఇప్పడిప్పుడే ఎర్కైనట్టున్నది వాళ్ళకు.