ముంబైలో ఆత్మహత్యకు పాల్పడిన టీవీ నటి తునీషా శర్మ అంత్యక్రియలు మంగళవారం మునీర్ రోడ్డులోని హిందూ స్మశానవాటికలో నిర్వహించారు. తుది వీడ్కోలు కోసం స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు భారీగా తరలి రాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న షీజన్ ఖాన్ తల్లి, సోదరిలు కూడా హాజరయ్యారు. ఊహించని పరిణామానాకి అందరూ ఆశ్చర్యపోగా, వారిద్దరూ తునీషా శర్మకు నివాళులు అర్పించారు. షీనాజ్ సోదరి ఫలాక్ నాజ్ లు ఇద్దరూ మంచి స్నేహితులు. దీంతో తునీషా శర్మ పార్థివ దేహాన్ని చూడగానే ఫలాక్ నాజ్ కన్నీటి పర్యంతం అయ్యారు.
#WATCH | TV actor Tunisha Sharma death case | Sister and mother of accused Sheezan Khan also arrived at the crematorium ground in Mira Road area for her last rites. pic.twitter.com/HA0voEOwQr
— ANI (@ANI) December 27, 2022
అనంతరం తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని అభ్యర్ధించగా, అంత్యక్రియలకు హాజరైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, నిందితుడు షీజన్ ఖాన్, తునీషాలు ప్రేమించుకోగా, శ్రద్దా వాకర్ హత్యతో నిందితుడు భయపడి ఏకపక్షంగా బ్రేకప్ చెప్పేశాడు. అప్పటికే గర్భవతి (?) అయిన తునీషా దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని సమాచారం. ఆమె తల్లి కూడా షీజన్ ఖాన్ తన కూతురిని శారీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని మానసికంగా వేధించాడని ఆరోపించింది. అటు శ్రద్ధా వాకర్ హత్యతో పాటు తమ మధ్య వయసు తేడా 8 ఏళ్లు ఉండడంతోనే బ్రేకప్ చెప్పానని పోలీసులకు చెప్పడం గమనార్హం.