దారి తప్పిన గొర్రె.. తోడేళ్లు కూడా ఏమీ పీకలేకపోయ్ - MicTv.in - Telugu News
mictv telugu

దారి తప్పిన గొర్రె.. తోడేళ్లు కూడా ఏమీ పీకలేకపోయ్

May 4, 2020

sheep on the run for five years, grows 60 pounds of wool

కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో గొర్రె ఒంటరిగా కనపడితే తోడేళ్ళు ఉంచుతాయా..? వేటాడి పండుగ చేసుకుంటాయి. అలాంటిది ఓ గొర్రె కొండ ప్రాంతంలో ఒంటరిగా ఐదేళ్లు గడిపింది. ఒక్క తోడేలు కూడా దానిని ఏం చేయలేకపోయింది. ఓ ఫాంలో ఉంటున్న గొర్రె తప్పించుకుని పర్వత ప్రాంతాల్లోకి పారిపోయింది. అది పారిపోయిన 6 సంవత్సరాల తరువాత తిరిగి వచ్చింది. దానిని తోడేళ్లు తినేందుకు ప్రయత్నించగా.. దాని శరీరంపై వెంట్రుకలు ఎక్కువుండటంతో వాటి బారి నుంచి సురక్షితంగా బయటపడింది. 

గొర్రెకు ఇప్పటివరకు సుమారు 60 పౌండ్ల బరువున్న ఉన్ని పెరిగిందట. ఈ గొర్రె ఫొటో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆరేళ్లుగా దీని ఉన్ని కట్ చేయకపోవడంతో ఇది ఒక వింత జంతువును తలపిస్తుంది. దూరం నుంచి చుస్తుంటో ఓ చిన్నపాటి కొండ కదలివస్తున్నట్లు అనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.