సబ్సిడీ గొర్రెలు ఏపీలోకి జంప్.. - MicTv.in - Telugu News
mictv telugu

సబ్సిడీ గొర్రెలు ఏపీలోకి జంప్..

November 25, 2017

తెలంగాణ సర్కారు పేద గొల్ల కురమల కోసం కేటాయించిన సబ్సిడీ గొర్రెల్లో చెప్పలేనన్ని అక్రమాలు సాగుతున్నాయి. తప్పుడు పత్రాలతో కొందరు వీటిని మంజూరు చేయించకుని కబేళాలకు అమ్ముతున్నారు. కొందరేమో పెళ్లిళ్లకు కోసుకుంటున్నారు. తాజగా ఈ గొర్రెలను సరిహద్దులు దాటించి ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్నారు. ఏపీ-తెలంగాణ సరిహద్దులోని నాగార్జున సాగర్‌ నుంచి గుండా రాత్రుళ్లపూట సబ్సిడీ గొర్రెలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలోని చెక్‌పోస్టు సబ్సిడీ గొర్రెలను ఏపీకి పట్టుకెళ్తున వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. దీంతో అక్రమార్కులు రోడ్డు మార్గంలో కాకుండా జీవాలను కృష్ణానదిలో పడవల ద్వారా ఏపీకి తరలిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ కాపలా కాయలేమని, గొర్రెలను ఎవరు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తమకెలా తెలుస్తుంది అధికారులు వాపోయితున్నారు.