Sheikh Dastagiri who filed a complaint against YCP at Kadapa police station
mictv telugu

చెల్లితో బావ కాపురం చేయకుండా వైసీపీ అడ్డు.. పోలీసులకు ఫిర్యాదు

July 29, 2022

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు. తన చెల్లితో బావను కాపురం చేయనీయకుండా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని వాపోయాడు. దీంతో వారిపై ఫిర్యాదు చేయడానికి కడపలోని దిశ పోలీస్ స్టేషనుకి వచ్చానని తెలిపాడు. బావను కాపురానికి రాకుండా అడ్డుపడుతున్నారని, దాంతో వారిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించి న్యాయం చేయాలని డీఎస్పీని కోరానని పేర్కొన్నాడు. కుటుంబం జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశాడు. కాగా, 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది.