నేను స్త్రీవాదినే...”ఫిదా” డైరెక్టర్  శేఖర్ కమ్ముల..! - MicTv.in - Telugu News
mictv telugu

నేను స్త్రీవాదినే…”ఫిదా” డైరెక్టర్  శేఖర్ కమ్ముల..!

July 26, 2017

ఫిదా సినిమాలో భానుమతి అనే క్యారెక్టర్ ను చాలా  పవర్ ఫుల్ గా చూపించిన  శేఖర్ కమ్ముల… ఆడవాళ్ల గురించి మాట్లాడుతూ…నేనూ ఒక ఫెమినిస్ట్ నని ఒక ఛానల్ కిచ్చిన ఇంటర్వూలో చెప్పారు, అందుకే నా సినిమాల్లో స్త్రీవాదం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు,మగాడు,ఆడవాళ్లు  నాదృష్టిలో ఇద్దరూ సమానమేనని అన్నారు.ఈ ఫిదా సినిమా ద్వారా అయినా  ఆడవాళ్లను చులకనగా చూడకుండా  వాళ్లని తక్కువ చేయకుండా  సొసైటీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నానని  చెప్పారు. ఆడవాళ్ల ఆలోచనలకు వాళ్ల ఇష్టాలను  గౌరవించి మగాడు ఆమెకు అండగా నిలబడాలని,నేను నాకూతురిని అలాంటి ఫెమినిస్ట్ భావాలతోనే పెంచుతున్నాను అన్నారు.ఈ ఫిదా సినిమాకు  నాజీవితానికి  చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పారు.ఫిదా సినిమాని చూస్తే మీకు అర్థమవుతుంది అందులో భానుమతి క్యారెక్టర్ ను మరియు సినిమాను విభేదించండం కష్టం అని అన్నారు.

నిజమే శేఖర్ కమ్ముల గతంలో తీసిన సినిమాలు చూస్తే ఆడవాళ్లకు  ఆయన ఇచ్చే గౌరవం ఏంటో అర్ధమవుతుంది,ఆయన తీసన ఆనంద్ సినిమాలో కమలినీ ముఖర్జీని  క్యారెక్టర్ ను చక్కగా చూపించారు,ఆ తర్వాత వచ్చిన  గోదావరి,అనామిక,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇప్పుడచ్చిన ఫిదా అన్ని సినిమాల్లో కూడా ఆడవాళ్లను ,వాళ్ల ఆలోచనలకు  గౌరవిస్తూ  స్త్రీవాదాన్ని తనదైన శైలిలో చూపించారు శేఖర్ కమ్ముల.అందుకే ఆడవాళ్లపై ఆయనకున్న  ఆలోచనలకు, ఆయన  వినమ్రతకు…ఆయన సినిమాలు చూసిన ఆడవాళ్లు…ఆడవాళ్లను గౌరవించే మొగవాళ్లు అందరు కూడా..ఫిదా అయ్యారు.