సుశాంత్ మరణం వెనుక మాఫియా, నెలలో 50 సిమ్ కార్డులు మార్చాడు..శేఖర్ సుమన్ - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్ మరణం వెనుక మాఫియా, నెలలో 50 సిమ్ కార్డులు మార్చాడు..శేఖర్ సుమన్

July 1, 2020

Shekhar Suman

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ సంఘటన జరిగి రెండు వారలు కావస్తున్నా.. ఇంకా అతడి ఆత్మహత్యకు సంబంధించి అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. తాజాగా టెలివిజన్‌ హోస్ట్‌, నటుడు శేఖర్‌ సుమన్‌.. సుశాంత్ మరణంపై సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లోని బంధుప్రీతి వల్ల సుశాంత్‌ మరణించలేదని.. ఇండస్ట్రీలోని గ్యాంగ్‌ల వల్లే అతడు‌ ఆత్యహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ను కలిసి సుశాంత్ మరణం గురించి చర్చించినట్టు శేఖర్‌ సుమన్‌ తెలిపారు.

‘సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడం వెనక ఏదో కుట్ర ఉన్నట్లు అనిపిస్తుంది. దీని గురించి సీబీఐ విచారణ జరగాలి. ఓ సిండికేట్‌, మాఫియా చిత్రపరిశ్రమను నడిపిస్తున్నాయి. ఇవే ఓ యువ నటుడి భవిష్యత్తును నాశనం చేశాయి. ఈ సిండికేట్‌లో భాగస్వాములైన స్టార్లందరు నాకు తెలుసు. కానీ, సరైన ఆధారాలు లేనందున వారి పేర్లు వెల్లడించడం లేదు. సుశాంత్‌ గత నెలరోజుల వ్యవధిలోనే దాదాపు 50 సిమ్‌ కార్డులు మార్చాడు. ఎవరి నుంచి తప్పించుకోవడం కోసం అతడు ఇలా చేశాడు. వృత్తిపరమైన శత్రువులు ఎవరైనా ఉన్నారా అని తెలియాలి.’ అంటూ శేఖర్‌ సుమన్‌ సంచలన ఆరోపణలు చేశారు.