కరణ్ జోహార్ పార్టీలో డ్రగ్స్ వాడారు.. బాలీవుడ్ నటుడు - MicTv.in - Telugu News
mictv telugu

కరణ్ జోహార్ పార్టీలో డ్రగ్స్ వాడారు.. బాలీవుడ్ నటుడు

September 20, 2020

bcv nb

బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య డ్రగ్స్ మలుపు తీసుకుంది. కంగనా రనౌత్ బాలీవుడ్ మీద చేసిన డ్రగ్స్ ఆరోపణలు మరింత దూమారం రేపాయి. కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, కపూర్ కుటుంబాల గురించి, నెపోటిజం వ్యవహారాలు తెరమీదకు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం బాలీవుడ్‌లోని సెలబ్రిటీలకు కరణ్ జోహార్ పార్టీ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ పార్టీ సాదాసీదాగా జరగలేదని.. పార్టీలో డ్రగ్స్ వినియోగించారని బాలీవుడ్ సీనియర్ నటుడు శేఖర్ సుమన్ ఆరోపించారు. 

ఆయన ఆరోపణలపై ఎన్‌సీబీ అధికారులు అలెర్ట్ అయి విచారణ ప్రారంభించారు. ఆ పార్టీలో పాల్గొన్న పలువురు స్టార్స్ డ్రగ్స్ వినియోగించారని ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీలో మలైకా అరోరా, అర్జున్ కపూర్, దీపికా పదుకొణె, షాహిద్ కపూర్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్.. తదితరులు ఉన్నారు. దీంతో ఈ పార్టీపై అనేక అనుమానాలు వచ్చాయి. అప్పట్లోనే పార్టీ వీడియోను కరణ్ పోస్ట్ చేశాడు. అది డ్రగ్స్ పార్టీ అనే ఆరోపణలు వచ్చాయి.దీనిపై కరణ్ స్పందిస్తూ.. ‘అది డ్రగ్స్ పార్టీ కాదు. నిజంగా డ్రగ్స్ వినియోగిస్తే పార్టీ వీడియోను ఎందుకు బయటకు తీసుకొస్తాను’ అని ప్రశ్నించాడు.