సూపర్ కారు.. లీటర్‌కు 1,491 కిలోమీటర్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

సూపర్ కారు.. లీటర్‌కు 1,491 కిలోమీటర్లు..

April 14, 2019

ఓ కారు అయినా లీటర్‌ డీజిల్‌కు ఎంత మైలేజీ ఇస్తుంది. 20 నుంచి 30 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది. అదే ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అయితే 14 నుంచి 15 కిలో మీటర్లు మాత్రమే మైలేజీ వస్తుంది. కానీ షెల్ మారథాన్ అనే ఈ కారు మాత్రం లీటర్ డీజిల్‌కు ఏకంగా 1,491 కిలోమీటర్లు. నమ్మబుద్ది కావడం లేదు కదూ.

Shell Eco-Marathon competitors stretch fuel mileage.

1982లో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ.. ‘షెల్ మారథాన్’ అనే కారును తయారు చేసింది. ఈ కారు గంటకు గరిష్టంగా 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇటీవల జర్మనీలోని ఎస్సెన్ లో జరిగిన క్లాసిక్, ప్రెస్టిజ్ ఆటోమొబైల్స్ టెక్నో క్లాసికా అనే కార్ల ప్రదర్శనలో ఈ కారును ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు వచ్చిన వారంతా ఈ కారు గురించి తెలుసుకుని ఆశ్చర్య పోయారు. ఇంత మైలేజీ వచ్చే కారు కూడా ఉంటుందా? అని షాక్‌కు గురయ్యారు.