Shen Dong saved the girl who slipped from the fifth floor
mictv telugu

వీడియో : ఐదో అంతస్తు నుంచి జారిపడ్డ బాలిక.. క్యాచ్ పట్టి కాపాడిన వ్యక్తి

July 23, 2022

Shen Dong saved the girl who slipped from the fifth floor

ఐదో అంతస్తు నుంచి జారి పడ్డ రెండేళ్ల బాలికను కాపాడిన వీడియో చైనాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వ్యక్తిని ప్రశంసించడంతో పాటు బాలిక ఆయుష్షు గట్టిదని కామెంట్లు చేస్తున్నారు. అద్భుతంగా ఉందనిపించే ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జెంజియాంగ్ ప్రావిన్స్‌లో టోంగ్జియాంగ్ ప్రాంతంలో షెన్ డాంగ్ అనే వ్యక్తి తన భార్యతో కారును పార్క్ చేస్తున్నాడు.

ఆ సమయంలో పెద్దగా కేకలు వినపడగా, కారు దిగి చూస్తే ఐదో అంతస్తు కిటికీ నుంచి చిన్న పాప జారి పడిపోతోంది. దీంతో అప్రమత్తమైన డాంగ్.. తన భార్యతో కలిసి పాప కింద పడే ప్రదేశానికి వేగంగా చేరుకున్నాడు. పాప జారుతున్నప్పుడు కిటికీకి ఆమె ఫ్రాక్ పట్టుకోవడంతో రెండు సెకండ్లు ఆలస్యం జరిగింది. అయినా కింద పడ్డ పాపను క్రికెట్‌లో బంతిని పట్టుకున్నట్టు షెన్ డాంగ్ పట్టుకున్నాడు. దంపతులు వేగంగా స్పందించడంతో పాప ప్రాణాలు దక్కాయి. దీంతో షెన్ డాంగ్‌ను నిజమైన హీరో అంటూ అభినందిస్తున్నారు.