చాన్స్ అడిగితే సెక్స్ వీడియో పంపాడు.. వర్మపై షెర్లినా ఆరోపణ - MicTv.in - Telugu News
mictv telugu

చాన్స్ అడిగితే సెక్స్ వీడియో పంపాడు.. వర్మపై షెర్లినా ఆరోపణ

August 19, 2019

Sherlyn Chopra Unknown Facts About Rgv..

షెర్లిన్ చోప్రా గాయినిగా, నటిగా, మోడల్‌గా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె తాజాగా టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు సినిమాలో అవకాశం కావాలంటూ  మెసేజ్ చేస్తే ఆయన ఏకంగా సెక్స్ వీడియో పంపించారని చెప్పింది. ‘మిడ్ డే ’అనే ప్రతికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వివరాలు వెల్లడించింది. 

రామ్‌గోపాల్ వర్మ ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు ఆమె సంచలన నిజాలు బయటపెట్టారు. ‘ఆర్జీవీ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన సినిమాల్లో అవకాశం కావాలని అడిగా. అప్పుడు ఆయన నాకో స్క్రిప్ట్ పంపించారు. అది చదివి నచ్చితే సినిమా చేద్దామన్నాడు. ఆ స్క్రిప్ట్ లో అంతా శృంగారమే ఉంది. ఓ రాజు, రాణి మధ్య ఉండే సన్నివేశం మాత్రమే. అప్పుడు  ఇదేంటని అతన్ని ప్రశ్నించా. వెంటనే అతడు ఒక సెక్స్ వీడియో పంపించారు. అందులో ఒక కుక్క, మహిళ ఉన్నారు. వెంటనే నాకు కోపం వచ్చింది. శృంగారం అనేది ప్రకృతిలో సహజం. మనిషికి అయినా.. పశువులకు అయినా ఒక్కటే అది చెప్పడానికే చేశానంటూ చెప్పారు. తర్వాత నేను కూడా సెలెంట్‌గా ఉండిపోయానంటూ చెప్పుకొచ్చింది.

ఇంత కాలం ఈ విషయం ఎందుకు బయటపెట్టలేదని అడగినప్పుడు దానికి కారణాన్ని కూడా వెల్లడించింది. ముందుగా అవకాశం కావాలని తానే అడిగాను కాబట్టి దాన్ని రాద్ధాంతం చేయదలుచుకోలేనంది. ఆ తర్వాత ఆయన్ను కాలవడం కానీ, అవకాశాలు కావాలని అడగటం ానీ మానేశానంటూ తెలిపింది.  షెర్లిన్ చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు ఫిలిం వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. మరి దీనిపై ఆర్జీవీ స్పందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.