Sheru weds Sweety: Gurugram couple conducts full marriage rituals for pet dogs
mictv telugu

కుక్కల పెళ్లికి ఊరంతా హడావుడి..

November 14, 2022

పైన టైటిల్ చూసి సామెత తప్పునుకుంటే.. మీరు 100% కరెక్టే. సామెత కరెక్ట్ కాకపోవొచ్చేమో కానీ ఆ వార్త మాత్రం నిజంగా నిజం.సంతానం లేని ఆ దంపతులు పెంపుడు కుక్క(స్వీటీ)నే తమ కన్నబిడ్డలానే పెంచుకున్నారు. పెంచి , పెద్ద చేసి తమ బాధ్యతగా అంగరంగ వైభవంగా భారతీయ సంప్రదాయ ప్రకారం పెళ్లి చేశారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. శుభలేఖలు, మెహందీ, హల్దీ వేడుకలు.. ఇలా అన్ని సాంప్రదాయాలు పాటిస్తూ.. మనుషులకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఘనంగా జరిగిందీ కుక్కల పెళ్లి.

గురుగ్రామ్ నగరానికి చెందిన సవిత అలియాస్ రాణి స్వీటీ అనే ఆడకుక్కను పెంచుకుంటోంది. తాము పెంచుకుంటున్న స్వీటీకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకోగా.. పొరుగునే ఉన్న మనీత.. తమ పెంపుడుకుక్క(షేరూ)తో స్వీటీకి పెండ్లి చేద్దామని చెప్పిందట. అన్ని ఆలోచించుకొని, నిర్ణయించుకున్న 4 రోజుల్లోనే పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె పేర్కొంది. ఈ కుక్కల వివాహం కోసం పాలం విహార్ ఎక్స్‌టెన్షన్‌లోని జిలే సింగ్ కాలనీ పరిసరాల్లోని వారికి 100 ఆహ్వాన కార్డులు పంచి హిందూ సంప్రదాయ పద్ధతిలో వేడుక నిర్వహించామని సవిత వివరించారు.

తాము ఎనిమిదేళ్లుగా మగ కుక్క షేరును పెంచుకుంటున్నామని, దీన్ని తమ బిడ్డలాగా చూసుకుంటున్నామని, అందుకే మా పెంపుడు కుక్క పెళ్లిని వేడుకగా చేశామని యజమాని మనీత చెప్పారు. పెండ్లికి వచ్చినవారు ఆ రెండు కుక్కల పెండ్లి తంతుని ఎంజాయ్‌ చేశారని, డ్యాన్సులు కూడా చేశారని రాణి అన్నారు. అయితే ఆహ్వాన సమయంలో కొందరు వింతగా ఉందని, తాము పెండ్లికి వస్తామని చెప్పారని, మరికొందరు పట్టించుకోలేదని, కుక్కలకు పెండ్లి ఏంటని ప్రశ్నించారని ఆమె తెలిపారు. అయినా తాము వేటినీ పట్టించుకోవలేదని, తాము అనుకున్న విధంగా షేరూ, స్వీటిని ఓ జంటను చేశామన్నారు. తన కూతురు లాంటి స్వీటీకి వంటపాత్రలు, చీరలు కొని వైభవంగా పెళ్లి చేశామని స్వీటీ యజమాని రాజా భావోద్వేగంతో చెప్పారు.