అటు పని అంటూ సతమవుతూ.. జీవితాన్ని సరిగా పట్టించుకోకుండా ఉంటున్నారు ఐటీ ఉద్యోగులు. అలాంటి వారికోసమే ఈ కంపెనీ పని వేళలు అయిపోగానే ఆటోమేటిగ్గా కంప్యూటర్స్ షటన్ డౌన్ అయ్యే ఏర్పాట్లు చేసింది.
ఇండోర్ కు చెందిన ఒక ఐటీ కంపెనీ తమ షిఫ్ట్ టైమింగ్స్ ముగిసిన తర్వాత ఉద్యోగుల కంప్యూటర్ లను షట్ డౌన్ చేసే ఆటోమేటెడ్ సిస్టమ్ ను అమలు చేసింది. సమయం అయిపోగానే.. ‘హెచ్చరిక!!! మీ షిఫ్ట్ సమయం ముగిసింది. ఆఫీస్ సిస్టమ్ 10 నిమిషాల్లో షట్ డౌన్ అవుతుంది. దయచేసి ఇంటికి వెళ్లండి’ అని అలర్ట్ వస్తుంది.
అద్భుతమైన మార్గం..
సాఫ్ట్ గ్రిడ్ కంప్యూటర్స్ అనే ఐటీ కంపెనీలో పని చేస్తున్న హెచ్ఆర్ తన్వీ ఖండేల్వాల్ తన లింక్డ్ ఇన్ లో ఈ చిత్రాన్ని పోస్ట్ చేసింది. దీంతో ప్రపంచానికి ఈ విషయం తెలిసింది. ఈ రకమైన ఆఫీసులో పని చేయడం వల్ల ఎంతో సంతోషకరంగా ఉందంటూ వ్యాఖ్యానించింది. ఈ పోస్ట్ దాదాపు 3.5లక్షలకు పైగా లైక్స్, 6వేల కంటే ఎక్కవ కామెంట్లను పొందింది. ఇందులో చాలామంది మాత్రం ఆ కంపెనీని పొగుడుతూ కామెంట్లు చేశారు. కొందరు ‘పని-జీవన సమతుల్యాన్ని ప్రోత్సహిస్తుంది, ఇలా చేయడం వల్ల వీకెండ్స్ కోసం ఎదురుచూడాల్సిన పని లేదు. మానసిక స్థితి మరింత మెరుగుపడుతుంది’ అంటూ చాలామంది అంటూ కామెంటారు. కొందరు మాత్రమే ‘పని సమయం ముగుస్తుందని ఒత్తిడికి గురవుతారు. ఇది రివర్స్ సైకాలజీ’ అంటూ నెగటివ్ కామెంట్స్ చేశారు. కానీ నిజంగా ప్రతి దేశంలో ఈ పని వేళలు ఉంటే సంతోషించే వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుందేమో కదా! మరి మీరేమంటారు?!