శిఖర్ ధావన్ అరుదైన రికార్డు సాధించాడు. 100వ వన్డేలో సెంచరీ చేసిన తొలి భారతీయ క్రికెటర్గా చరిత్రకెక్కాడు. దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డేలో టీమిండియా ఓపెనర్ ధావన్ చెలరేగి ఆడాడు. తొలి నుంచి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ధావన్ 99 బంతుల్లో 10ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు.
కెరీర్లో 100వ వన్డే ఆడుతున్న ధావన్ న్యూ వాండరర్స్ స్టేడియంలో పరుగులకే పరుగులు పెట్టిస్తున్నాడు. వన్డే కెరీర్లో అతనికిది 13వ సెంచరీ. ఆతిథ్య దక్షిణాఫ్రికాపై మూడోది. 2015 ప్రపంచకప్లో ఇదే జట్టుపై 137 పరుగులు పెట్టాడు. దీన్ని తాజా మ్యాచ్ లో అధిగమిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వన్డే క్రికెట్లో వందో వన్డే మ్యాచ్లో శతకం చేసిన ఆటగాళ్లలో జోర్డాన్ గ్రీనిడ్జ్, క్రిస్ గేల్, రాంనరేశ్(వెస్టిండీస్), క్రిస్ కెయిర్స్న్(న్యూజిలాండ్), మహ్మద్ యూసుఫ్(పాకిస్తాన్), కుమార సంగక్కర(శ్రీలంక) తదితరులు ఉన్నారు