శిఖా చౌదరికి క్లీన్‌చిట్.. ఎందుకంటే ? - MicTv.in - Telugu News
mictv telugu

శిఖా చౌదరికి క్లీన్‌చిట్.. ఎందుకంటే ?

March 14, 2019

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో అరెస్ట్ అయిన ముగ్గురుని జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ ఎఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జయరాం హత్య తర్వాత రాకేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ మంత్రులకు ఫోన్ చేసినట్లు దర్యాప్తు తేలిసిందన్నారు. హత్యలో వారి ప్రమేయం ఏమైన ఉందా అనే కోణంలో  రాకేష్ రెడ్డి కాల్ డేటాను పరిశీలిస్తున్నామని, ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామన్నారు.

Shikha Choudhari is cleaned because .. Jubilee Hills West Zone DCP Srinivas.

జయరాం హత్యకేసులో సినీ నటుడు సూర్య, కిషోర్, అంజిరెడ్డిలు కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. జయరాంను కిషోర్ అనే వ్యక్తి హానీ ట్రాప్ చేసి, రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. సూర్య, కిషోర్‌లు ఇద్దరూ కలిసి వీణ అనే అమ్మాయి పేరు చెప్పి జయరాంను తీసుకురావాలని రాకేష్ రెడ్డి ఆదేశించాడు. చెప్పినట్లుగానే జయరంను రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. దీంతో వారిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు.

అంజిరెడ్డి అనే వ్యక్తికి హత్య విషయం ముందే తెలిసినా.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. రాకేష్‌రెడ్డి జయరాం వద్ద సంతకాలు పెట్టించుకున్న పత్రాలను అంజిరెడ్డి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. శిఖా చౌదరికీ హత్యకేసుతో సంబంధలేదని పేర్కొన్నారు. రాకేష్ రెడ్డికి ఏపీలో రాజకీయంగా మంచి పలుకుబడి ఉందని, దాన్ని అడ్డుపెట్టుకుని అందరనీ బయపెట్టి డబ్బులు తీసుకునేవాడని డీసీపీ వెల్లడించారు.