Shikhar Dhawan scored 12 thousand runs in List A cricket
mictv telugu

ముగిసిన భారత్ ఇన్నింగ్స్.. ధావన్ అరుదైన రికార్డు

November 25, 2022

Shikhar Dhawan scored 12 thousand runs in List A cricket

కివీస్ తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. మొత్తం 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు అర్ధ సెంచరీలతో రాణించగా, మిడిలార్డర్ లో పంత్, సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచారు. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 80, సంజూ శాంసన్ 36 పరుగులతో రాణించడంతో స్కోర్ బోర్డు పరుగులు తీసింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ (16 బంతుల్లో 37 నాటౌట్ 3 ఫోర్లు, 3 సిక్సులు)తో విరుచుకుపడడంతో స్కోరు 300 పరుగులు దాటింది.

న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచులో సంజు శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా, ఓపెనర్ గా వచ్చి 77 పరుగులు చేసిన కెప్టెన్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. లిస్ట్ – ఏ క్రికెట్ లో 12 వేల పరుగుల మైలురాయి అందుకున్న 7వ భారత ఆటగాడికా రికార్డులకెక్కాడు. వ్యక్తిగత స్కోరు 43 పరుగుల వద్ద ధావన్ ఈ ఘనత సాధించాడు. ధావన్ కంటే ముందు సచిన్, గంగూలీ, ద్రావిడ్, కోహ్లీ, ధోనీ, యువరాజ్ సింగ్ ఉన్నారు. అటు న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. తొలి ఓవర్ ముగిసేనాటికి కివీస్ మూడు పరుగులు చేసింది.