టీం ఇండియా ఆటగాడు శిఖర్ ధావన్ ప్రస్తుతం తన తాజా ఇంటర్వ్యూ ద్వారా ట్రెండ్ అవతున్నాడు. ఆజ్ తక్ షో ‘సీధీ బాత్’లో తన జీవిత విషయాలను పంచుకున్నాడు. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తన పెళ్ళి, భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గబ్బర్..తన బాల్యంలో మరో ఆసక్తిక కర విషయాన్ని వెల్లడించాడు.
15వ ఏటనే HIV టెస్ట్
తన 15వ ఏటనే HIV టెస్ట్ చేసుకున్నట్లు శిఖర్ ధావన్ వెల్లడించాడు. ఇందుకు టాటూ వేయించుకోవడమే కారణమని చెప్పాడు ఈ లెఫ్ట్ హ్యాండర్. తన ఫ్యామిలీ మనాలీ టూర్ వెళ్ళిన సమయంలో కుటుంబ సభ్యులకు తెలియకుండా భుజంపై టాటూ వేసుకున్నట్లు శిఖర్ తెలిపాడు. మూడు నెలలు ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడినా..తర్వాత తన తండ్రికి తెలిసిపోయిందన్నాడు. ఆ సమయంలో తీవ్రంగా కొట్టారని చెప్పాడు. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు వివరించాడు. టాటూ వేసే వ్యక్తి ఎటువంటి సూదితో వేశాడో అని భయపడి HIV టెస్ట్ చేయించారన్నారు. అయితే ఆ టెస్ట్‌లో నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నామని ధావన్ స్పష్టం చేశాడు.
పెళ్లి చేసుకొని ఇబ్బంది పడ్డా
ఇదే ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి జీవితం గురించి కూడా పలు విషయాలను పంచుకున్నాడు. అదే విధంగా పెళ్లి చేసుకోబోయే కుర్రాళ్ళకు విలువైన సలహాలు, సూచనలు చేశాడు. ” తనకంటే 12 ఏండ్లు పెద్దదైన మహిళను పెళ్లి చేసుకొని, ఆ తర్వాత రకరకాలు ఇబ్బందులు పడ్డాను. పెళ్లి అనే పరీక్షలో గెలవలేకపోయా. . వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి రాసే పరీక్ష అని, రిజల్ట్ ఏ ఒక్కరి చేతుల్లో ఉండదు.
ఆయేషాతో ప్రేమలో పడిన తొలినాళ్లలో ప్రతి విషయం మధురంగానే అనిపించేది. తర్వాత ఇబ్బంది పడ్డా. ఒకవేళ భవిష్యత్తులో తాను మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఆచితూచి నిర్ణయం తీసుకుంటా. కొన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉండి, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకున్నాకే పెళ్లి గురించి ఆలోచించండి” అంటూ ధావన్ వెల్లడించాడు.
పంజాబ్ కెప్టెన్
ప్రస్తుతం ఐపీఎల్ -2023కి శిఖర్ ధావన్ సిద్ధమవుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న ధావన్..జట్టుకు ట్రోఫి సాధించిపెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే పంజాబ్‌కు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్ మొదలైంది. . తమ హోం గ్రౌండ్ మొహాలీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. పంజాబ్ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్1న కేకేఆర్‌తో తలపడనుంది.