సరోగసి ద్వారా రెండోసారి తల్లైన శిల్పాశెట్టి - MicTv.in - Telugu News
mictv telugu

సరోగసి ద్వారా రెండోసారి తల్లైన శిల్పాశెట్టి

February 21, 2020

Shilpa Shetty and Raj Kundra welcome their second child

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. శిల్పాశెట్టి.. వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు వియాన్‌ అనే కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న సరోగసీ ద్వారా వీరికి ఆడబిడ్డ జన్మించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శిల్పా శెట్టి తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. 

శిల్పా శెట్టి ఇంస్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేస్తూ..”ఇన్నాళ్ల మా ప్రార్థనలకు ప్రతిగా ఓ అద్భుతం జరిగింది. చిట్టితల్లి మా జీవితాల్లోకి రావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. సమీశా శెట్టి కుంద్రా.. ఫిబ్రవరి 15న జన్మించింది. సమీశాలో స అంటే సంస్కృతంలో కలిగి ఉండటం అని అర్థం. మిశ అంటే రష్యన్‌ భాషలో దేవత. మా ఇంటి లక్ష్మి.. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది. మా ఏంజెల్‌కు మీ ఆశీర్వాదాలు కావాలి.” అని క్యాప్షన్ ఇచ్చింది. ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న శిల్పా శెట్టి త్వరలో షబ్బీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నికమ్మ’ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.

View this post on Instagram

|| Om Shri Ganeshaya Namah || Our prayers have been answered with a miracle… With gratitude in our hearts, we are thrilled to announce the arrival of our little Angel, ???????? ?????? ??????? Born: February 15, 2020 Junior SSK in the house? ‘Sa’ in Sanskrit is “to have”, and ‘Misha’ in Russian stands for “someone like God”. You personify this name – our Goddess Laxmi, and complete our family. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀ ~ Please bestow our angel with all your love and blessings??❤ ~ Ecstatic parents: Raj and Shilpa Shetty Kundra Overjoyed brother: Viaan-Raj Kundra . . . . . . . . . #SamishaShettyKundra? #gratitude #blessed #MahaShivratri #daughter #family #love

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on