చిక్కుల్లో శిల్పాశెట్టి భర్త.. ఈడీ సమన్లు - MicTv.in - Telugu News
mictv telugu

చిక్కుల్లో శిల్పాశెట్టి భర్త.. ఈడీ సమన్లు

October 29, 2019

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. 2013లో మరణించిన దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్‌ మిర్చికి సంబంథించిన కేసులో రాజ్ కుంద్రాపై ఆరోపణలున్నాయి. 

Shilpa Shetty husband Raj Kundra.

ఈ కేసులో రాజ్ కుంద్రాను విచారించేందుకు ఈడీ సిద్ధం అవుతోంది. ఈ కేసుకు సంబంధించి రంజీత్ బింద్రా, బాస్టియన్ హాస్పిటాలిటీ అనే సంస్థతో రాజ్ కుంద్రాకున్న లావాదేవీలను పరిశీలిస్తోంది. ఇటీవల వీరిద్దరి మధ్య కొన్ని వ్యాపార లావాదేవీలపై కీలక సమాచారం అందింది. దీంతో సమన్లు​ జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. రాజ్ కుంద్రా స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాల్సి ఉంది. ఇందుకోసం నవంబర్ 4న ముంబైలోని విచారణ అధికారుల ముందు హాజరు కావాలని కుంద్రాకు నోటిసులిచ్చారు. బాస్టియన్ హాస్పిటాలిటీ సంస్థతో రంజీత్‌ బింద్రాకు ప్రమేయం ఉందని, రంజీత్ బింద్రాతో దగ్గరి సంబంధాలున్నాయని ఈడీ అధికారులు అంటున్నారు. ముంబైలో విలువైన ఆస్తుల అమ్మకాలు, కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో ఇక్బల్‌ మిర్చిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ తర్వాత 2013లో గుండెపోటుతో ఇక్బాల్ మిర్చి మృతిచెందాడు. పలు ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదురుకొంటున్న రంజిత్ బింద్రాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను రాజ్ కుంద్రా ఖండించారు.