రూ.5,555కే 55 అంగుళాల స్మార్ట్ టీవీ - MicTv.in - Telugu News
mictv telugu

రూ.5,555కే 55 అంగుళాల స్మార్ట్ టీవీ

October 1, 2019

Shinco 55-inch 4K LED TV to Be Available for Rs. 5,555

రోజు రోజుకి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు చాలా తగ్గుముఖం పడుతున్నాయి. ఒకప్పుడు 21 అంగుళాల టీవీ కొనాలంటేనే ఎంతో వెచ్చించాల్సి వచ్చేది. అలాంటిది ఈ రోజుల్లో పదివేల రూపాయలలోపే స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి. 

 

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థల రాకతో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు మరింత తగ్గాయి. తాజాగా అమెజాన్ 55 అంగుళాల టీవీని కేవలం రూ.5555కే విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఆ సైట్‌లో కొనసాగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా రూ.33,999 ధర ఉన్న షింకో 55 అంగుళాల 4కె ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని కేవలం రూ.5,555కే అందిస్తోంది. ఈ క్రమంలో ఈరోజు రాత్రి 9 గంటలకు అమెజాన్‌లో ఈ టీవీకి గాను ప్రత్యేక ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు. అందులో పాల్గొనే వారు కేవలం రూ.5,555 పే చేసి ఆ టీవీని కొనుగోలు చేయవచ్చు