షైన్ పిల్లల హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం…చిన్నారి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

షైన్ పిల్లల హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం…చిన్నారి మృతి

October 21, 2019

హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో ఉన్న షైన్‌ పిల్లల హాస్పిటల్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐసీయులో షాట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన ఐదు నెలల చిన్నారి మరణించింది. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. 

Shine children's hospital.

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో మొత‍్తం 42మంది చిన్నారులు ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వీరిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల తల్లిదండ్రుల నిరసన తెలిపారు. హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.