Shining Big B at Hyderabad Metro Station ..
mictv telugu

హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో మెరిసిన బిగ్‌బి..

June 30, 2022

బాలీవుడ్ స్టార్ హీరో, బిగ్‌బి అమితా బచ్చన్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గం మెట్రో స్టేషన్ తళుక్కున మెరిశారు. దాంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురై, నిజంగా ఆయన అమితా బచ్చన్‌నేనా అని కొద్ది సెకండ్లపాటు సందేహించారు. అనంతరం ఆయనను తమ ఫోన్లలో ఫోటోలను తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో బిగ్‌బి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

అమితా బచ్చన్ గతకొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం ఆయన రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో సందడి చేశారు.ట్రైన్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం స్టేషన్‌కు వెళ్లిన ఆయనను చూసేందుకు పలువురు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఫొటోను షేర్ చేస్తూ, ఓ నెటిజన్.. ”నాకు తెలిసి అమితాబ్ షూటింగ్ కోసం వచ్చి ఉండొచ్చు. ఓ బ్లూ లైన్ ట్రెయిన్‌లోకి ఎవరినీ అనుమతించలేదు. నేను అమీర్‌పేట్ స్టేషన్లో సాయంత్రం 6 గంటలకు వేచి ఉన్నాను. మెట్రో ఒక డమ్మీ రైలును రద్దీ వేళల్లో ఎందుకు నడిపిస్తోందో నాకు అప్పుడు అర్థం కాలేదు. రైలులో అమితా బచ్చాన్ కనిపించలేదు కానీ, మెడలో ఐడీ కార్డులు వేసుకున్న కెమెరామ్యాన్‌లు కనిపించారు’’ అని పేర్కొన్నాడు.

అమితాబ్ ప్రస్తుతం ‘ప్రాక్ట్ కె’ సినిమా కోసం గతకొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొణి హీరోయిన్‌గా కీలక పాత్రల్లో అమితా బచ్చన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడుగా, వైజయంతి మూవీస్ పతాకంపై సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో గతకొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్ హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.