విశాఖలో భారీ ప్రమాదం.. సముద్రంలోకి దూకి (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖలో భారీ ప్రమాదం.. సముద్రంలోకి దూకి (వీడియో)

August 12, 2019

విశాఖపట్నం తీరంలో ఈ రోజు మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఔటర్  హార్బర్‌లోని కోస్టల్ జాగ్వార్ నౌకలో భారీ మంటలు చెలరేగాయి.   నౌక సిబ్బంది సాహసంతో లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. దీంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.  తీరగస్తీ దళం హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోట్లలో నౌక సిబ్బందిని తీసుకొచ్చారు. తర్వాత ఫైరిజంన్లతో మంటలు ఆర్పారు.  నౌకలో మొత్తం 29 మంది సిబ్బంది ఉన్నారని, ఒకరి ఆచూకీ దొరకడం లేదని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. అతని కోసం గాలింపు సాగుతోందన్నారు.