ఆందోళన వద్దు, ఆలయం తెరిచే ఉంటుంది : షిర్డీ ట్రస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆందోళన వద్దు, ఆలయం తెరిచే ఉంటుంది : షిర్డీ ట్రస్ట్

January 18, 2020

;awtu

షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేస్తున్నట్టు వస్తున్న కథనాలపై భక్తులు ఆందోళన చెంద వద్దని ఆలయ ట్రస్ట్ సూచించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై షిరిడీ గ్రామస్థులతో చర్చిస్తామని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. షిర్డీ గ్రామస్థులు చేసే నిరసనకు ఆలయానికి సంబంధం లేదన్నారు. 

షిర్డీ ఆలయం నిరవధికంగా మూసిస్తున్నట్టు తెలియడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో భక్తులు ఆయోమంలో పడిపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వం షిర్డీకి బదులు పత్రి గ్రామంలోని ఆలయాన్ని అభివృద్థి చేస్తామని ప్రకటించింది. దీని కోసం రూ. 100 కోట్లు కూడా ఉద్దవ్ థాక్రే సర్కార్ విడుదల చేసింది. దీని వల్ల షిర్డీ ఆలయానికి ఆదాయం తగ్గిపోతుందని అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. విభేదాలు సృష్టించేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. 

దీన్ని నిరసిస్తూ నిరవధికంగా ఆలయాన్ని మూసివేయాలని ప్రకటించారు. తర్వాత భక్తుల ఇబ్బందుల దృష్ట్యా గ్రామస్థుల నిరసనల వరకు మాత్రమే పరిమితం చేసే విధంగా కనిపిస్తోంది. ఈ సాయంత్రం ట్రస్ట్ సభ్యులు షిర్డీ గ్రామస్థులతో చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. కాగా కాగా పర్భణీ జిల్లాలోని పత్రి అనే ఊరు సాయిబాబా జన్మస్థలమన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. కానీ దీనిపై షిర్డీ గ్రామస్థులు అభ్యంతరం తెలుపుతున్నారు.