ఔను..వాళ్లిద్దరికి పరిచయం ఉంది..ఇదే ఆధారం..! - MicTv.in - Telugu News
mictv telugu

ఔను..వాళ్లిద్దరికి పరిచయం ఉంది..ఇదే ఆధారం..!

June 15, 2017

ఈ క్రైమ్ వార్త.. టీవీల్ని దున్నేస్తోంది. చెప్పింది చెబుతూ..మధ్య మధ్యలో కొత్తవి జోడిస్తూ 24 గంటల బులెటెన్స్ ఆడిస్తున్నారు. మలుపుల మీద మలుపు తిపుతూ క్రైమ్ సీరియల్ లా మధ్య మధ్యలో ట్విస్టులు ఇస్తూ నడిపిస్తున్నారు. వాళ్లకు వాళ్లే ప్రశ్నలు లెవనెత్తున్నారు. జవాబులు ఇస్తున్నారు. అలా జవాబు ఇచ్చి ఇయ్యని ఓ ప్రశ్నకు మేము కచ్చితంగా ఆధారాలతో ఆన్సారిస్తున్నాం..ఇంతకు ఏంటీ అది అంటే…

ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి, బ్యూటీషియన్ శిరీష ల ఆత్మహత్య కేసులు ఫోటో గ్రాఫర్ రాజీవ్ చుట్టే తిరుగుతున్నాయి. ఇతను నోరు విప్పితేనే నిజాలు బయట పడుతాయి. అసలు శిరీష ,రాజీవ్ కు ఉన్న పరిచయం ఏంటీ.. రాజీవ్‌.. పెళ్లిల్లో ఫోటోలు, వీడియోలు తీస్తే శిరీష పెళ్లికూతుళ్లకి అలంకరణ చేసేది. ఇంతటితోనే వీరి పరిచయం ఆగలేదు …బయట కూడా కలిసి తిరిగేవాళ్లు..తరచుగా హోటళ్లకు వెళ్లేవారు. దీనికి ఫేస్ బుక్ లో ఆమె పోస్ట్ చేసిన లోకేషన్ షేరింగే ఆధారం. ఇదోక్కటి కాదు ఆమె అకౌంట్ లో చాలా ఉన్నాయి. ఆమె సోషల్ మీడియా అకౌంట్లను పోలీసులు పరిశీలిస్తే మరిన్ని వివరాలు దొరకొచ్చు..కేసుల్ని మిస్టరీ త్వరగా వీడేలా చేయొచ్చు…జరదేఖో పోలీస్ సాబ్..