రూపాయికే చొక్కా.. రూ. 10కే నైటీ..  - MicTv.in - Telugu News
mictv telugu

రూపాయికే చొక్కా.. రూ. 10కే నైటీ.. 

October 27, 2019

one rupee  ...

వ్యాపారులు లాభాల కోసమే వ్యాపారం చేస్తారు. కొందరు వ్యాపారులు కాస్త పెద్దమనసుతో నిరుపేదలకు ధర తగ్గించి అమ్ముతుంటారు. ఆ వ్యాపారిది మరీ పెద్దమనసు. అందుకే కేవలం ఒక రూపాయికే చొక్కా, రూ. 10 రూపాయలకే నైటీ అమ్మేశాడు. దీపావళి పండగను పేదజనం కూడా బాగా జరుపుకోవాలని ఈ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.

చెన్నైలోని వాషర్‌మెన్‌పేటలో ఉన్న పెరుమాళ్ టైక్స్‌టైల్స్ యజమాని ఆనంద్ గత వారం రోజులపాటు పేదలకు ఇలా వస్త్రాలు అమ్మేశాడు. రోజూ ఉదయం 10 నుంచి 11 గంటలకు మాత్రమే ఈ ఆఫర్ అమలైంది. జనం బారులు తీరడంతో ఆఫర్ ను కొంతమందికే పరిమితం చేశాడు. రోజూ 50 మందికి చొక్కాలు, 50 మందికి నైటీలు అమ్మాడు. తర్వాత రోజుకు 200 టోకన్లు ఇచ్చాడు. జనం పెద్ద సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తను చేసింది పెద్ద ఘనకార్యమేమీ కాదని, కొంతమంది పేదలైనా కొత్త బట్టలతో పండగ జరుపుకోవాలి తక్కువ ధరకు అమ్మానని ఆనంద్ చెప్పారు. ‘మొదట ఉచితంగా ఇద్దామనుకున్నాను. కానీ ఉచితంగా ఇస్తే విలువ ఉండదు. అందుకే రూపాయికి, 10 రూపాయలకు అమ్మాను…’ అని అన్నారు.