మహారాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎత్తుకు పైఎత్తులు పడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అక్రమమని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఈ రోజు సాయంత్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. బీజేపీకి సంఖ్యాబలం లేకుండా ఫడణవీస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి గవర్నర్ తప్పు చేశారని ఆరోపించాయి.
తమ మూడు పార్టీలకు కలిపి 144 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరాయి. ఎన్సీపీ చీలిక వర్గం మద్దతులో 105 స్థానాలు గెల్చుకున్న బీజేపీ ఈ రోజు పొద్దున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో అజిత్‌కు నచ్చజెప్పి, బీజేపీతో తెగతెంపులు చేసుకుని బయటికి రప్పించేందుకు ఆయన తండ్రి శరద్ పవార్ ఎన్సీపీ సీనియర్ నేతలను పురమాయించారు.