Sonu Nigam: బాలీవుడ్ గాయకుడు సోనూనిగమ్‎పై దాడి...!! - MicTv.in - Telugu News
mictv telugu

Sonu Nigam: బాలీవుడ్ గాయకుడు సోనూనిగమ్‎పై దాడి…!!

February 21, 2023

 

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూనిగమ్ పై దాడి జరిగింది. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో సోనూనిగమ్ తోపాటు ఆయన స్నేహితుడిపై కూడా దుండగులు దాడికిపాల్పడినట్లు తెలుస్తోంది. సోనూనిగమ్ సెక్యూరిటీ అతన్ని రక్షించాడట. ప్రస్తుతం సోనూనిగమ్ చెంబూరులోని జైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ మ్యూజికల్ ప్రొగ్రామ్ లో దాడి జరిగింది. సోనూనిగమ్ తో కలిసి సెల్ఫీ దిగుతుండగా తోపులాట జరిగింది. ఆ తర్వాతే ఆయనపై దాడి జరిగిందని ఆరోపించారు.

ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్ చెంబూర్ ఉత్సవంల సోనూ నిగమ్ ను కలిసేందుకు ప్రయత్నించాడు. అతనితో సెల్ఫీలు తీసుకోవాలని కొంతమంది చెట్లు ఎక్కారు. గాయకుడిని కలవడానికి వారిని పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అతని సహచరుడు రబ్బానీ ఖాన్ కిందపడేశారు. ఈక్రమంలోనే ఎమ్మెల్యే కుమారుడు, అతని సెక్యూరిటీ సోనూనిగమ్ తోపాటు అతని స్నేహితుడిని దూషిస్తూ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.