సుశాంత్ సింగ్‌కు అంత ప్రచారమెందుకు : శివసేన ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్ సింగ్‌కు అంత ప్రచారమెందుకు : శివసేన ఎంపీ

June 28, 2020

hnhvm

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై ఆయన స్పందించారు. మీడియా ఈ విషయాన్ని అతిగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలో కొంత మంది కారణంగా చనిపోయాడని చెప్పడం సరికాదని అన్నారు. ఏ రంగంలో అయినా ఒడిదుడుకులు ఉంటాయని వాటిని తట్టుకొని నిలబడాలని చెప్పారు. అతడు నటన రంగంలో అనుకున్న లక్షాలు చేరుకోలేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని అభిప్రాయపడ్డాడు. కొంత మంది ఆధిపత్యం అంటూ ప్రచారం చేయవద్దని సూచించారు.

ఈ విషయంలో మీడియా సుశాంత్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చిందిన అన్నారు. ఈ వార్తల కవరేజీతో మీడియా పండుగ చేసుకుందని పేర్కొన్నారు. ఒక రైతు,సైనికుడు వీరమరణం పొందినా ఇలాంటి కవరేజ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని సంజయ్ రౌత్  ప్రశ్నించారు. ఇకనైనా ఇలాంటి పద్దతిని మార్చుకోవాలని సూచించారు. లేదంటూ ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో సంప్రదాయంగా మారిపోతుందనే విషయాన్ని ఎత్తి చూపారు. దీనిపై సుశాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌పై కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేసి విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.